Sharwanand 37 Movie : శర్వా 37లో సాక్షి వైద్య

టాలీవుడ్ హీరో శర్వానంద్ ( Sharwanand ) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా.. శర్వా 37. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సామజవరగమన ఫేం అబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. మనమే సినిమాతో మంచి హిట్ ను అందుకున్న శర్వానంద్.. ఈ మూవీతోనూ మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి శర్వా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. దానికి సినీ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇకపోతే తాజాగా ఈ మూవీలో నటించే హీరోయిన్ ను ఇంట్రడ్యూజ్ చేశారు మేకర్స్. ఇందులో సాక్షి వైద్య ( Sakshi Vaidya ) హీరోయిన్ గా నటిస్తుందని తెలిపారు. ఇవాళ సాక్షి వైద్య బర్త్ డే ఈ సందర్భంగా మేకర్స్.. ఈ విషయాన్ని తెలియజేశారు. ఆమెకు విషెస్ చెబుతూ.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నిత్య సాక్షి అనే పాత్రలో నటిస్తుందని పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఏజెంట్, గాండీవధారి అర్జున వంటి సినిమాలతో సాక్షి వైద్య టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com