Salman Khan : సల్మాన్ ఇంటి ముందు కాల్పులు.. నిందితులు అరెస్ట్

Salman Khan : సల్మాన్ ఇంటి ముందు కాల్పులు.. నిందితులు అరెస్ట్

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులకు తెగబడ్డ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. గుజరాత్‌లోని భుజ్ ప్రాంతంలో వీరు పట్టుబడినట్లు తెలిపారు. ఈ నిందితులు నవీ ముంబయి పన్వెల్‌లోని హరిగ్రామ్‌ ప్రాంతంలో నెల రోజులుగా అద్దె ఇంట్లో మకాం వేసినట్లు సోమవారం ఓ అధికారి తెలిపిన విషయం తెలిసిందే.

కాగా ఆదివారం ఉదయం ఐదు గంటల సమయంలో బాంద్రా ప్రాంతంలో సల్మాన్‌ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఇది తమ పనేనని ప్రకటించుకున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్.. సల్మాన్‌కు ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని హెచ్చరించారు.

ఈ మొత్తం విషయం పై ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. సోమవారం వార్తా సంస్థ PTI CCTV ఫుటేజీ నుండి తీసిన చిత్రాన్ని విడుదల చేసింది. ఫోటోలో, నిందితులు టోపీ ధరించి, భుజాలపై బ్యాగ్‌ని పట్టుకుని కనిపించారు. దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించే ముందు, బాంద్రా పోలీసు అధికారి మాట్లాడుతూ IPC సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద ‘తెలియని వ్యక్తి’పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది

Tags

Read MoreRead Less
Next Story