Rashmika Mandanna : సల్మాన్ సరసన రష్మిక మందన్నా

యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ మూవీలో గీతాంజలి పాత్రలో కనిపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో పుజ్ బిజీగా ఉంది. త్వరలోనే పుష్ప 2లో శ్రీవల్లిగా మరోసారి అలరించనుంది. దీంతో పాటు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా కుబేరాలో నటిస్తోంది. రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ అందుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ సికిందర్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ ఈ బ్యూటీ కొట్టేసింది. ఈ విషయాన్ని రష్మిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. మూవీ మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రష్మికకు సికిందర్ సినిమా 25వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను వచ్చే రంజాన్ కు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ఫిల్మ్ గా సికిందర్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com