Samantha : సమంత హవా.. యూట్యూబ్​లో అత్యంత వేగంగా 20 కోట్ల వ్యూస్

Samantha : సమంత హవా.. యూట్యూబ్​లో అత్యంత వేగంగా 20 కోట్ల వ్యూస్

ఓ తెలుగు సినిమా పాట ఇంకా యూట్యూబ్ లో దుమ్ములేపుతూనే ఉంది. పుష్ప ద రైజ్ సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్.. అప్పట్లోనే ఓ యూట్యూబ్ లో భూకంపం పుట్టింది. రిలీజైన 68 రోజుల్లోనే యూట్యూబ్​లో ఆ పాటకు 20 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 'ఊ అంటావా? ఉఊ అంటావా' సాంగ్ మ్యూజిక్ వింటూ అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు. యూట్యూబ్​లో ఇంత తక్కువ టైంలో ఇన్ని భారీ వ్యూస్ సాధించిన ఏకైక సాంగ్‌గా 'ఊ అంటావా? ఉఊ అంటావా' రికార్డు పుటల్లోకి ఎక్కింది.

ఈ సాంగ్​లో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ అప్పియరెన్స్​ ఆడియన్స్ కు బాగా నచ్చింది. తక్కువ రోజుల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా పుష్ప ఐటమ్ నంబర్ టాప్ లో నిలిచింది. మహేశ్ బాబు- శ్రీలీల సూపర్ హిట్ మూవీ ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ 78 రోజుల్లోనే 20 కోట్ల వ్యూస్‌ను సాధించి ఈ లిస్టులో రెండో స్థానంలో నిలిచింది.

బన్నీ- పూజా హెగ్డే కాంబినేషన్‌లో ఉండే 'బుట్టబొమ్మ బుట్టబొమ్మ' సాంగ్ 95 రోజుల్లో 20 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. కొరియోగ్రఫీ, టేకింగ్ హైలైట్ గా ఉండే ఈ పాట ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. యూట్యూబ్ యూజర్స్ పెరిగిపోవడం, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వస్తుండటం.. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో త్వరలోనే పుష్ప2లో పాటలు ఈ రికార్డులన్నీ చెరిపేస్తాయన్న చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story