Samantha : సమంత పారితోషికం ఎంతో తెలుసా..?

Samantha : సమంత పారితోషికం ఎంతో తెలుసా..?

హీరోయిన్ సమంత (Samantha) గురించి అడిగితే కొంతమంది ఫేడవుట్ అయిపోయిందంటారు. మరికొందరు మాత్రం ఆమెకు రాబోయే క్రేజ్ గురించి చెబుతారు. జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న సమంత.. రానున్న రెండేళ్లపై బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి సమంత రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో సమంత రేటు దగ్గర తగ్గుతుంది అనుకున్నవాళ్లకు వాస్తవం తెలిసి దిమ్మతిరిగిపోయింది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. వెబ్ సిరీస్ లు, హాలీవుడ్ క్రేజ్ తో సమంత భారీగా డిమాండ్ చేస్తోంది.

వెబ్ సిరీస్ లలో సమంతకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. రాజ్ అండ్ డీకేతో చేసిన 'సిటాడెల్‌' వెబ్ సిరీస్ కోసం సమంత ఏకంగా రూ.10 కోట్ల పారితోషికం అందుకొందని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకొంటున్నారు. ఇటీవల విజయ్ సినిమాకు సంతకాలు చేసింది సమంత. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ సినిమాకు గానూ.. సమంత రూ.6 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందని టాక్. ఇప్పటి వరకూ ఓ సినిమాకు గానూ సమంత అందుకొన్న అత్యధిక పారితోషికం ఇదే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గానూ సమంత ఎంత అందుకొంటుందో ఊహించుకోవొచ్చు. ఇటీవల సమంత కమర్షియల్ యాడ్స్‌లోనూ మెరుస్తోంది. ఒకొక్క వాణిజ్య ప్రకటనకు రూ.1.5 కోట్లు డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story