Samantha : మమ్ముట్టితో కలిసి సమంత కొత్త ప్రయత్నం

నటి సమంత ( Samantha ) టాలీవుడ్లో దాదాపు పదేళ్లకు పైగా స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళ చిత్రాల్లో సైతం మెరిసిన ఈ అందాల భామ కొన్ని తెలుగు చిత్రాల్లో ఐటమ్ పాటలు సైతం చేసి మెప్పించింది. అయితే వరుస అపజయాలు ఆమె కెరీర్ ను గందరగోళంలో నెట్టాయి.
సినిమా పరిశ్రమలో ఎప్పుడైనా విజయానికే ప్రాధాన్యత ఉంటుంది. శాకుంతలం, ఖుషీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో ఆమెకు కొత్త అవకాశాలు తగ్గాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో సమంత మళయాల సినీ ఎంట్రీ ఇవ్వనుందని తెలిసింది.
మళయాల స్టార్ మమ్ముట్టితో కలిసి సినిమా చేయబోతోందని సమాచారం. ఈ చిత్రాన్ని మమ్ముట్టి స్వయంగా నిర్మిస్తారని తెలిసింది. థ్రిల్లర్ కథతో రూపొందుతుందని అంటున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా నటించనున్న చిత్రంలో సమంత మళయాల సినీ ఎంట్రీ ఇస్తుందని స్పష్టమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com