Samantha : సమంత ఇన్ని కోట్లు ఎక్కడివి..? హాట్ టాపిక్

Samantha : సమంత ఇన్ని కోట్లు ఎక్కడివి..? హాట్ టాపిక్

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగుపెట్టిన సమంత కోటీశ్వరురాలు అనే సంగతి ఇప్పుు హాట్ టాపిక్ అయింది. ఆ తరువాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించి స్టార్ హీరోయిన్ గా మారింది . కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటికి కోడలుగా మారిపోయింది. ఆ తర్వాత విడాకులు ఇచ్చేసి ఇప్పుడు సింగిల్ గా కోట్లు కూడబెడుతోంది సమంత.

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైనా కూడా దాన్నుంచి బయటపడింది సమంత. ఇప్పుడు సమంత పేరు పై ఉన్న ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సమంత టోటల్ ఆస్తి రూ.127 కోట్లకు పైగానే ఉంటుందట.

సమంత ఫ్యామిలీ మిడిల్ క్లాస్. ఇండస్ట్రీలోకి వచ్చాక సమంత ఎంత కష్టపడి సంపాదించినా సినిమాకి రెండు మూడు ఐదు కోట్లు మాత్రమే తీసుకుంటూ వచ్చింది. విడాకులు తర్వాత భరణం కూడా నాగచైతన్య వద్ద తీసుకోలేదు. సమంతకు ఉన్న ఫాలోయింగ్, బ్రాండింగ్, ప్రమోషన్లు, వెబ్ సిరీస్ లు, సినిమాలతోనే కష్టపడి సంపాదిస్తోందని అంటున్నారు ఫ్యాన్స్.

Tags

Read MoreRead Less
Next Story