Samantha : నెగిటివ్ కామెంట్ .. నెటిజన్ కు సమంత స్ట్రాంగ్ కౌంటర్

Samantha : నెగిటివ్ కామెంట్ ..  నెటిజన్ కు సమంత స్ట్రాంగ్ కౌంటర్
X

చై సామ్ విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. విడిపోయినప్పుడు చాలా క్లారిటీగా ఒక వివరణ ఇచ్చిన వీళ్లిద్దరూ తమ జీవితాలు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా నే కోరుకున్నారు. విడాకులు అనేది వాళ్ల వ్యక్తిగతం ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఇక వారి వ్యక్తిగత జీవితం పై ఎన్ని కామెంట్స్ వస్తున్నా కూడా ఈ జంట ఎప్పుడూ కూడా పెద్దగా స్పందించింది లేదు. ఇక సమంత మాత్రం అప్పుడప్పుడు తన భావాలను వ్యక్తపరిచే ప్రయత్నం అయితే చేస్తోంది.

సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే సమంత (Samantha) తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. రీసెంట్ గా ఆమె ఒక పాడ్ క్యాస్ట్ వీడియో చేసినప్పుడు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితానికి

సంబంధించిన ఒక ప్రశ్న ఎదురయింది. అమాయకుడైన నీ భర్త చైతన్యను ఎందుకు వదిలేసావు అనేలా ఒక నెటిజన్ ఆమెను ప్రశ్నించాడు. దీనికి సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ఇలాంటి పద్ధతి మంచిది కాదని చెప్పింది. మీకు అంతా మంచి జరగాలని, మీరు మరింత దృఢంగా మారాలని కోరుకుంటున్నట్టు రిప్లయ్ ఇచ్చింది. సమంత వివరణలో, మనకు అవసరం లేని మరొకరి వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించకూడదు అని ఆమె చెప్పకనే చెప్పేసింది. మీ జీవితం గురించి మీరే ఆలోచించుకోవాలి కానీ ఇతరుల వ్యక్తిగత విషయాలపై ఎక్కువగా ఆలోచించేంత తక్కువ మనసుతో ఉండొద్దనే భావాన్ని వ్యక్తం చేసింది.

Tags

Next Story