Samantha : అందరూ అనుమానపడ్డా.. ఆయన ఒక్కడు నమ్మాడు

Samantha : సమంత తెలుగుతెరకు పరిచయమై సరిగ్గా పధ్నాలుగేళ్లు. 14ఏళ్ల క్రితం అదే రోజున 'ఏ మాయ చేశావే' విడుదలైంది. అందులో సమంతను చూసి యువతరం హృదయాలు బరువెక్కాయి. అయితే.. తను తెలుగు సినిమాను ఏలుతుందని మాత్రం అప్పడు ఎవరూ ఊహించలేదు. తొలి సినిమాలో క్లాస్ కనిపించిన సామ్.. కాలక్రమేణ మాస్ హీరోయిన్ గా వెండితెరపై మెరుపులు మెరిపించింది.
ముఖ్యంగా 'రంగస్థలం'లో తాను నటించిన రామలక్ష్మి పాత్ర అయితే.. నెక్స్ట్ లెవల్. కెరీర్ 14ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాను నటించిన పాత్రల గురించి అభిమానులతో ముచ్చటించారు సామ్. రామలక్ష్మి పాత్ర గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. 'ఆ పాత్రకు నన్ను అనుకోగానే సుకుమార్ టీమ్ లోనే చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారట. ఎందుకంటే రామలక్ష్మి పల్లెటూరి అమ్మాయి. నేను అప్పటివరకూ చేసిన పాత్రలన్నీ రామలక్ష్మికి పూర్తి భిన్నమైనవి.
రామలక్ష్మి మాటతీరు.. ఆటిట్యూట్ అంతా భిన్నంగా ఉంటాయి. అందుకే వాళ్లు నాలో రామలక్ష్మిని చూడలేకపోయారు. కానీ సుకుమార్ చూశారు. కాబట్టే ప్రపంచం చూసింది. అందరూ మెచ్చుకున్నారు కూడా. డీ గ్లామరైజ్డ్ కేరక్టరే అయినా.. రామలక్ష్మిలో ఏదో తెలియని అందం. నన్నడిగితే నా మిగతా కేరక్టర్లకంటే రామలకే ష్మ అందగత్తె' అంటూ చెప్పుకొచ్చింది సామ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com