Oscar 2025 : ఆస్కార్ 2025 రేసులో సంతోష్

Oscar 2025 : ఆస్కార్ 2025 రేసులో సంతోష్
X

అస్కార్ అవార్డుల బరిలో ఇండియా నుంచి ఈ ఏడాది లాపతా లేడీస్ మూవీ సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే భారత్ నుంచి మరో హిందీ చిత్రం 'సంతోష్ 'కూడా ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. కానీ ఈ మూవీ మనదేశం నుంచి మాత్రం ఎంపిక కాలేదు. ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఈ మూవీకి అక్కడి బ్రిటీష్ నిర్మాతలు మద్దతు తెలిపడంతో... సంతోష్ మూవీ యూకే నుంచి ఆస్కార్ కు ఎంపికైంది. ఈ మూవీని మైక్ గుడ్దిడ్జ్, జేమ్స్ బాషర్, బాల్తాజర్ డి గనే, అలాన్ మెక్అలెక్స్ నిర్మించారు. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి సంతోష్ స్టోరీని రాయడంతో పాటు ఈమె దర్శకత్వం వహించారు. ఉత్తర భారతదేశంలోని ఓ పల్లెటూ రులో జరిగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీనే సంతోష్, కొత్తగా పెళ్లయిన ఓ మహిళకు భర్త చనిపోవడంతో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఆమెకు ఇవ్వబడుతుంది. విధి నిర్వహణలో ఓ బాలిక హత్య కేసును ఆ మహిళ ఛేదించాల్సి వస్తుంది. అయితే ఆమె కేసును ఏ విధంగా దర్యాప్తు చేస్తుందనేది ఈ మూవీ స్టోరీ. ఇందులో మహిళ పాత్రను షహానా గోస్వామి చేశారు.

Tags

Next Story