Satyabhama Movie Postponed : సత్యభామ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Satyabhama Movie Postponed : సత్యభామ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నసినిమా సత్యభామ. సుమన్ చిక్కాల డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాజల్ కెరీర్లో 60వది కావడం విశేషం. నవీన్ చంద్ర కూడా ఇందులో నటించాడు. అయితే ఈ సినిమా మే 31న రిలీజ్ కానుందని ముందుగా మేకర్స్ ప్రకటించారు. కాగా ఇప్పుడీ మూవీ విడుదల వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ సత్యభామ మూవీకి తాజాగా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఒక వారం ఆలస్యంగా జూన్ 7న సత్యభామ ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ కనిపించనుంది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ లాంచ్ చేశారు. ఇందులో కాజల్ చేతిలో గన్ పట్టుకొని గురి పెడుతూ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపించింది. మూవీ కోసం ఈ ముద్దుగుమ్మ ప్రమోషన్లను కూడా బాగానే చేస్తోంది. ఇక తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకున్న కాజల్.. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకోని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

Tags

Next Story