Apoorva Srinivasan : రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్

Apoorva Srinivasan : రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్

టాలీవుడ్ నటి అపూర్వ శ్రీనివాసన్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి ఏడడుగులు వేసినట్లు ఇన్‌‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ వేడుకకు ఒకే ఒక్క తెలుగు హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాత్రమే హాజరైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులే మధ్యే ఈ వివాహం జరిగింది.

ఈ సందర్భంగా అపూర్వ మెడలో మూడు ముడులు వేసిన తర్వాత భార్యను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు శ్రేయాస్ శివ కుమార్. కాగా ఈమె టెంపర్ సినిమాలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్2, తదితర చిత్రాల్లో నటించారు. ఈమె చివరగా 2022లో 'నీతో' మూవీ చేసింది. తర్వాత సైలెంట్ అయిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story