Sharwanand : శర్వానంద బిడ్డను చూశారా.. పేరేంటో తెలుసా..?

Sharwanand : శర్వానంద బిడ్డను చూశారా.. పేరేంటో తెలుసా..?

శర్వానంద్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా యూత్‌ను ఆకట్టుకునే విధంగా లవ్ స్టోరీస్ లో కూడా నటిస్తూ ఉంటాడు శర్వానంద్. ఇక పర్సనల్ విషయానికి వస్తే గత ఏడాది శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రక్షితా రెడ్డి అనే యువతిని శర్వానంద్ వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.

ఈ జంట మధ్య మంచి కెమిస్ట్రీ ఇక ఈ జంట ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా.. ప్రేమాను రాగాలతో జీవిస్తుంటారు. ఇక తాజాగా ఈ జంట ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్‌ను చెప్పారు. శర్వానంద్, రక్షిత దంపతులు తల్లిదండ్రులు అయ్యారని.. శర్వానంద్ సతీమణి రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు వివరించారు. అయితే ఈ గుడ్ న్యూస్ శర్వానంద్ ఆలస్యంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. పాప పుట్టి కొన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ విషయాన్ని దాచాడు సర్వానంద్. నేడు తన పుట్టినరోజు కావడంతో తన ముద్దుల కూతురూ, భార్యతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశాడు. అంతేకాదు తన కుమార్తె పేరును కూడా ఈ ఫోటోతో పాటే రివీల్ చేశాడు.

ట్రెడిషనల్ పేరును తన కూతురికి పెట్టాడు శర్వానంద్. లీలాదేవి అని తన పాపకు నామకరణం చేశాడు. ఇక ఈ పేరు అమ్మవారి పేరు కావడం అది కూడా ఎంతో ట్రెడిషనల్ గా అనిపించడంతో అంతా శర్వానంద్‌ను ప్రశంసిస్తున్నారు. బర్త్ డే హ్యాపీ టైమ్స్ లో కూతురితో కలిసి మేము కూడా కొత్త జర్నీ ప్రారంభిస్తున్నాం అంటూ శర్వా పోస్ట్ పెట్టారు. క్యూట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story