Shatrughan Sinha : ఆసుపత్రిలో చేరిన శతృఘ్న సిన్హా

Shatrughan Sinha : ఆసుపత్రిలో చేరిన శతృఘ్న సిన్హా
X

బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ( Shatrughan Sinha ) వైరల్ ఫీవర్‌తో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఇవాళ డిశ్చార్జ్ అవుతారని సమాచారం. పని ఒత్తిడితో ఆయన అనారోగ్యానికి గురవ్వగా కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్పించారు. ఇటీవలె శత్రుఘ్న కూతురు సోనాక్షి ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కార్యక్రమాలతో జూన్ నెలంతా ఆయన బిజీబిజీగా గడిపారు.

సినిమా ఇండస్డ్రీలో గాసిప్‌లకు కొదవలేదు. సోనాక్షి సిన్హా వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు శత్రుఘ్న సిన్హా కలత చెంది ఉండవచ్చని కొందరు ప్రచార చేస్తున్నారు. అందుకే ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటో తెలిసింది.

జహీల్ ఇక్బాల్, సోనాక్షి సిన్హా గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వీరి ప్రేమకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. రిసెప్షన్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Next Story