Shivaji's Transformation : శివాజీ ఏంటి ఇలా మారిపోయాడు.. అసలెక్కడున్నాడు?

Shivajis Transformation : శివాజీ ఏంటి ఇలా మారిపోయాడు.. అసలెక్కడున్నాడు?

రెండు దశాబ్దాల కిందట యూత్ ఫుల్ హీరో శివాజీ. 90స్ కిడ్స్ కు శివాజీ గురించి బాగా తెలుసు. ఆ మధ్య పొలిటికల్ గా హడావుడి చేసిన శివాజీ ఈ మధ్య బిగ్ బాస్ తో మళ్లీ ఫేమ్ లోకి వచ్చాడు. ఇటీవలే.. 90స్ కిడ్స్ వెబ్ సిరీస్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాడు.

బిగ్ బాస్ తర్వాత.. వెబ్ సిరీస్.. ఇలా వరుసగా జనంలో నానాడు శివాజీ. ఐతే.. కొద్దిరోజులుగా కనిపించకుండా పోయాడు. ఎక్కడా ఇంటర్వ్యూల్లోనూ అగుపించలేదు. లేటెస్ట్ గా స్టార్ కమెడియన్ అలీ హోస్ట్‌గా చేసిన ఓ షోకు గెస్ట్ గా వచ్చాడు శివాజీ. ప్రోమోలో అలీ అడిగిన ప్రశ్నలు.. శివాజీ చెప్పిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శివాజీని తన ప్రశ్నలతో తికమకపెట్టి ఎంటర్ టైన్ మెంట్ అందించాడు అలీ. సినిమాలకు దూరంగా ఉన్న టైంలో #90's కిడ్స్ సిరీస్ ఆఫర్ ఎలా వచ్చింది.. అని ప్రశ్నకు శివాజీ బదులిచ్చాడు. చాలా కాలం తర్వాత బాపినీడు గారిని కలవాలని వెళ్ళా.. ఆ టైంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది.. అదే విషయం చెప్పా. అదేం పర్లేదు దాన్ని వదలకు అంటూ శివాజీ వివరించారు. ఆ తర్వాత #90's కిడ్స్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ కోసం దాదాపు రూ.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ అయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు. తనను ఎవరో గుర్తుపట్టకుండా మీసాలు, గడ్డలు తీసేసి దుబాయిలో తిరిగావంట.. ఎందుకు అని అని అలీ ప్రశ్నించాడు.

వేషం మార్చి దుబాయ్ లో పట్టుబడ్డ శివాజీ.. అప్పటికప్పుడు కోర్టులో అంతా జరిగిపోయింది.. ప్రస్తుతం వ్యాపారం చేయాలంటే రాజకీయం కచ్చితంగా చేయాలంటూ వివరించాడు. 2019లో అలంద మీడియా కేసులో శివాజీ పోలీసులకు పట్టుబడినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఒక టీవీ ఛానల్ వాటాల వ్యాపారంలో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు శివాజీ. పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం.. దీంతో శివాజీ ఎవరికంటా పడకుండా ఉండడానికి గడ్డం తీసేసి దుబాయ్ వెళుతున్న టైం లో పోలీసులు పట్టుకోవడం జరిగాయట. అవన్నీ తప్పుడు కేసులు అని శివాజీ వివరించాడు. ఇవన్నీ శివాజీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు. అలీ పూర్తి ఎపిసోడ్ వస్తే ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి క్లారిటీ వచ్చే చాన్సుంది.

Tags

Read MoreRead Less
Next Story