Rajashekar Daughter : శివాత్మికకు ఎందుకు ఆఫర్లు రావడం లేదో!

Rajashekar Daughter : శివాత్మికకు ఎందుకు ఆఫర్లు రావడం లేదో!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ (Rajashekhar) నట వారసులుగా ఎంట్రీ ఇచ్చిన శివానీ, శివాత్మిక లు హీరోయిన్స్ గా సక్సెస్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు లో స్టార్ కిడ్ లకు అంతగా ఆదరణ, అవకాశాలు ఉండవు. కనుక ఈ సిస్టర్స్ కి ప్రతిభ ఉన్నా కూడా ఫలితం లేకుండా పోయింది. అవకాశాలు వచ్చినా.. రాకున్నా సక్సెస్ దక్కినా.. లేకున్నా కూడా వీరిద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అందమైన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ను అలరిస్తూ ఉంటారు. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా వీరిద్దరు అందమైన ఫొటోలను షేర్ చేయడం ద్వారా ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.

తాజాగా మరోసారి చిన్నమ్మాయి దొరసాని శివాత్మిక రాజశేఖర్ అందమైన ఫొటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి కాస్త క్లోజప్ షాట్ లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోను షేర్ చేసింది. క్లీవేజ్ షో తో పాటు కవ్వించే చూపులతో శివాత్మిక చూపు తిప్పుకోనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళంలో కూడా ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు అయినా తెలుగు లో వరుసగా సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంత అందంగా ఉన్న శివాత్మిక కు ఎందుకు ఆఫర్లు రావడం లేదో అన్నట్లుగా కొందరు ఫిల్మ్ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story