Samantha : అందాల ఆరబోతపై సమంత షాకింగ్ కామెంట్స్

హీరోయిన్ సమంత (Samantha) ఏడాది గ్యాప్ తర్వాత తిరిగి సినిమా షూటింగ్స్ కు రెడీ అవుతోంది. మయో సైటిస్ తో పాటు విరామం లేని షూటింగ్స్ కారణంగా అలసి పోయిన సమంత ఏడాది బ్రేక్ తీసుకుంది. సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె తన అనారోగ్య సమస్యలను చెప్పాలని కోరుకోలేదని, కానీ యశోద సినిమా నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకుని ఆ సమయంలో ప్రమోషన్ కి బయటకు వచ్చాను.
అప్పుడే తన అనారోగ్య సమస్య బయట పడింది. కానీ కొందరు సింపతీ కోసం అంటూ నన్ను విమర్శించారు . అందాల ఆరబోత విషయం తనకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించే విషయమే..' అంటోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా పాట కోసం స్కిన్ షో పై మాట్లాడుతూ.. ‘నాకు అలాంటి ఔట్ ఫిట్స్ తో ఇబ్బందే. అయినా కూడా కొన్ని సార్లు తప్పడం లేదు' అన్నది. కానీ ప్రేక్షకుల కోసం తాను ఔట్ ఫిట్స్ తో కనిపించానంటోంది. త్వరలో సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సమంత.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com