Mrunal Thakur : పెరిగిన మృణాల్ ఠాకూర్ రేటు.. నిర్మాతలకు షాక్
![Mrunal Thakur : పెరిగిన మృణాల్ ఠాకూర్ రేటు.. నిర్మాతలకు షాక్ Mrunal Thakur : పెరిగిన మృణాల్ ఠాకూర్ రేటు.. నిర్మాతలకు షాక్](https://www.tv5news.in/h-upload/2024/04/13/1236241-mrunal-thakur-remuneration.webp)
మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో తెలుగువారిని ఫస్ట్ సినిమాతోనే హార్ట్ స్ట్రోక్ ఇచ్చినంత గట్టిగా గుండెల్లో ముద్రేసిన హీరోయిన్. బాలీవుడ్ సీరియల్స్ ద్వారా పాపులారిటీ దక్కించుకుని.. అక్కడి సినిమాల్లో ట్రై చేసినా పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో మాత్రం మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది మృణాల్. ముట్టుకుంటే బంగారం అన్నట్టు ప్రతి సినిమా కూడా హిట్ కావడంతో.. అమ్మడు రేట్ అమాంతం పెంచేసింది.
ఈమధ్య ఫ్యామిలీ స్టార్ కాస్త నిరాశపరిచినా.. అమ్మడి పెర్ ఫామెన్స్ క్రేజ్ లో మాత్రం కించిత్ తేడా లేదు. సీతారామం, హాయ్ నాన్న రెండు సినిమాల క్రేజ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. చేతిలో మంచి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ కోసం రూ.3 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న మృణాల్.. ఆ సినిమా తర్వాత రూ.5 కోట్లు డిమాండ్ చేస్తుందని టాక్.
టాప్ అండ్ యూత్ హీరోలకు మృణాల్ లక్కీ హీరోయిన్ గా మారింది. హను రాఘవపుడి, ప్రభాస్ కాంబోలోలో రానున్న సినిమాలో కూడా మృణాల్ హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com