Kajal Aggarwal : షాకిచ్చిన శంకర్.. ఆ సినిమాలో కాజల్ లేదట

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా భారతీయుడు 2. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ.. జులై 12న గ్రాండ్ గా విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగ ర్వాల్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి భారతీయుడు 2 ఆడియో లాంఛ్ ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు పలువురు స్టార్స్ హాజరయ్యారు.
ఈ వేడుకలో కాజల్ అగర్వాల్ గురించి డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భా రతీయుడు 2లో కాజల్ కనిపించదని క్లారిటీ ఇచ్చాడు. ఆమె చేసిన సన్నివేశాలన్నీ భారతీయుడు 3లో ఉంటాయని తెలిపాడు. దీంతో కాజల్ ఫ్యాన్స్ కాస్త నిరాశపడుతున్నారు. సినిమాలో కాజల్ ఉండదనే సరికి హర్ట్ అవుతున్నారు. ఇక భారతీయుడు 2 లో ఎస్జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇండియన్ 2 సినిమా షూటింగ్ ఐదేళ్ల క్రితమే మొదలైంది. అయితే, వివిధ కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యమవుతూ వస్తోంది. ఓ దశలో ఈ ప్రాజెక్ట్ ఉండదేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, మళ్లీ గతేడాదిలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలు ఎక్కింది. ఇండియన్ 3 కూడా తీసుకురావాలని శంకర్ డిసైడ్ అయ్యారు. ఎట్టకేలకు ఇండియన్ 2 చిత్రం జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com