Shriya : స్లీవ్ లెస్ డ్రెస్ లో శ్రియ.. మాములుగా లేదుగా

Shriya : స్లీవ్ లెస్ డ్రెస్ లో శ్రియ..  మాములుగా లేదుగా

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదిగి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరితో నటించి మెప్పించిన బ్యూటీ.. శ్రియా శరణ్. తమిళ్, హిందీ, కన్నడ భాషల్లోనూ యాక్ట్ చేసి అభిమానులను అలరించింది ఈ అమ్మడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇన్నేళ్లైనా.. ఇప్పుడు కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. మూవీస్, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోపక్క సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాలో తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసింది. అందులో పాము పొర లాంటి పొడవాటి స్ట్రెయిట్ కట్ అవుట్ ఫిట్ లో అదరగొట్టింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం శ్రియా షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

నెటిజన్ల నుంచి కూడా శ్రియా ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత వయసులోనూ ఎంత హాట్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల 'మ్యూజిక్ స్కూల్' టైటిల్ తో ఓ సినిమా చేసింది శ్రియా. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన 'కబ్జా' మూవీలోనూ లీడ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టుల లో ఈ బ్యూటీ నటిస్తోంది.

Tags

Next Story