Shruti Haasan : మాళవికకు చెక్ పెట్టిన శ్రుతి

Shruti Haasan : మాళవికకు చెక్ పెట్టిన శ్రుతి
X

రాజాసాబ్ షూటింగ్స్ లో బిజీబిజీగా ఉన్న భామ మాళవిక మోహనన్. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో నటించలేదీ అమ్మడు. ఇప్పటి వరకు తమిళ్ లో ఆడియన్స్ ని అలరిస్తున్న మాళవిక టాలీవుడ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. డార్లింగ్ హీరో, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తుండటంతో ఆమెకు తన భవిష్యత్ పై భారీగానే హోప్స్ ఉన్నాయి. రజినీకాంత్ సినిమా కూలీ సినిమాలో మొదట ఆయన కూతురు పాత్రకు మాళవికను అనుకున్నారట. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అనూహ్యంగా మాళవిక ప్లేస్ లో శ్రుతి హాసన్ వచ్చి చేరింది. ఆ సినిమాలో శృతి హాసన్ ఫిమేల్ లీడ్ గా నటుస్తుంది. శృతి హాసన్ ఈమధ్యనే లోకేష్ కనకరాజ్ తో ఒక వీడియో సాంగ్ చేసింది. 'ఇనిమేల్ ’ఆల్బమ్ లో వీ రిద్దరు ఆడిపాడారు. ముఖ్యంగా శ్రుతి హాసన్ రొమాంటికి సీన్లకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అప్పుడు ఆ మధ్య వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ అవ్వడం వల్ల ఈ చాన్స్ వచ్చి ఉండొచ్చనే టాక్ ఉంది.

Tags

Next Story