Kamal Haasan : పవర్ ఫుల్ పాత్రలో శింబు

Kamal Haasan : పవర్ ఫుల్ పాత్రలో శింబు
X

చాలారోజుల తర్వాత ఓ పవర్ ఫుల్ పాత్రలో శింబు కనిపించనున్నాడు. 'విక్రమ్'తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకున్న ఉలగనాయకన్ కమల్ హాసన్ మరో క్రేజీ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ 'థగ్ లైఫ్ 'తో రాబోతున్నారు.

1987లో వచ్చిన కమల్ హసన్, మణిరత్నం కల్ట్ ఫిల్మ్ 'నాయకన్' తర్వాత ఈ లెజండరీ ద్వయం మరోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో సిలంబరసన్ టిఆర్ (శింబు) కీలక పాత్రపోషిస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ టీజర్ షేర్ చేస్తూ శింబుని పరిచయం చేశారు. మేకర్స్, టీజర్ లో శింబు కార్ లో దుమ్మురేపుతూ వచ్చి గన్ ని గురిపెట్టడం పవర్ ఫుల్ గా వుంది.

ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. రవికె చంద్రన్ సినిమాటోగ్రఫర్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. అన్ బరివ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, కమల్ హాసన్ లుక్ అభిమానులతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకుంది.

Tags

Next Story