Vijay Sethupathi : వృద్ధురాలు సెల్ఫీ ఇస్తూ విజయ్ సేతుపతి చేసిన పనికి సోషల్ మీడియా ఫిదా

Vijay Sethupathi : వృద్ధురాలు సెల్ఫీ ఇస్తూ విజయ్ సేతుపతి చేసిన పనికి సోషల్ మీడియా ఫిదా
X

విజయ్ సేతుపతి.. తమిళ్ లో ట్రెండింగ్ నటుడు. భాషతో సంబంధం లేకుండా ఎదుగుతున్న నటుడాయన. తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తమిళనాడులో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉదయం స్టార్ట్ అయిన ఎన్నికలు సాయంత్రం వరకు ప్రశాంతంగా జరిగాయి.

ఓటు వేసేందుకు కోలీవుడ్ స్టార్ట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వీల్ చైర్ లో నడవలేని ఓ వృద్ధురాలు విజయ్ సేతుపతిని చూసి సెల్ఫీ అడిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె కాళ్లకు నమస్కారం పెట్టి కిందకి కూర్చొని మరి ఆమెతో సెల్ఫీ దిగాడు విజయ్. ఈ వీడియో ఇపుడు వైరల్ గా మారింది.

పెద్దవాళ్లంటే మంచి అభిప్రాయం, గౌరవ భావం చూపిన విజయ్ ను జనం పొగుడుతున్నారు. నీలాంటి హీరోనే అందరికీ ఆదర్శంగా నిలవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags

Next Story