Sonakshi Sinha : పెళ్లికి సిద్ధమైన సోనాక్షి

Sonakshi Sinha : పెళ్లికి సిద్ధమైన సోనాక్షి
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ( Sonakshi Sinha ).. పెళ్లికి చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన ప్రియుడు, నటుడైన జహీర్ ఇక్బాల్ ను ఆమె పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ముంబైలో ఈనెల 23న వీరిద్దరు ఒక్కటికానున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ.. ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకోనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.

వీరి పెళ్లికి ఇరువురి దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారని తెలుస్తోంది. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న సోనాక్షి, ఇక్బాల్.. తమ లవ్ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. నటుడు శత్రుఘ్న సిన్హా కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది సోనాక్షి సిన్హా.

సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైంది. ఈ సినిమా మంచి హిట్ సాధించడంతో.. తన ఫస్ట్ మూవీతోనే ఓ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుంది.చివరిసారిగా సంజయ్ లీలా బన్సాలీ రూపొందించిన హీరామండి వెబ్ సిరీస్లో ఈ బ్యూటీ నటించింది.

Tags

Next Story