Spirit : స్పిరిట్ సినిమా .. దీపిక ఔట్ .. రుక్మిణి ఇన్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొణెను తప్పించారు. ఆమె ప్లేస్ లో కన్నడ నటీమణి రుక్మిణి వసంతను తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 'కల్కి 2898 ఏడీ' సినిమాతో ప్రభాస్తో కలిసి నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దీపికా పదుకొణె, 'స్పిరిట్' సినిమాలో నూ హీరోయిన్ గా నటించనుందని అందరూ భావించారు. అయితే, ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడానికి పలు కారణాలు చెబుతున్నారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం, దీపికా 8 గంటల వర్కింగ్ షిఫ్ట్, రూ. 20 కోట్ల రెమ్యునరేషన్, సినిమా లాభాల్లో వాటా, తెలుగు డైలాగ్స్ చెప్పడానికి నిరాకరణ వంటి షరతులు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆమెను తప్పించినట్టు తెలుస్తోంది.దీంతో ఆమె స్థానంలో రుక్మిణి వసంతన్ ను తీసుకునేందుకు మూవీ టీం చర్చలు జరుపుతోందని టాక్. 2019లో 'బిర్బల్ ట్రిలాజీ' సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆమె, 2023లో 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాలతో ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో ప్రియ పాత్రలో ఆమె నటనకు ఫిల్మ్ఫేర్ క్రిటిక్స్ అవార్ కూడా దక్కింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com