Sree Leela : అలా అయితే సినిమాలు చేయను : శ్రీలీల

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ.. శ్రీలీల (Sree Leela). అనంతరం రవితేజ ధమాక సినిమాలో ఈ అమ్మడు యాక్ట్ చేసింది. మొదటి సినిమా నిరాశ పరిచిన ధమాకతో మంచి హిట్ ను అందుకుంది. దీంతో శ్రీలీలకు వరుస అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశాన్ని సైతం ఈ బ్యూటీ దక్కించుకుంది. అయితే ఇందులో కొన్ని సినిమా ఫ్లాప్స్ అయినప్పటికీ శ్రీలీలకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయట.
కానీ శ్రీలీల మాత్రం ఆచితూచి సినిమాల ఎంపిక చేస్తుందని సమాచారం. ఈ మధ్య కాలంలో రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశం శ్రీలీలకు రాగా వాటిని ఆమె తిరస్కరించిందట. డాన్స్ కోసమో, గ్లామర్ డాల్ పాత్రలు కోసమో తాను సినిమాలు చేయనని చెప్పిందట. అలాంటి పాత్రలకు తనకు ఆసక్తి లేదని తెలిపిందట.
ప్రముఖ హీరోల సినిమాలను కూడా శ్రీలీల సున్నితంగా తిరస్కరించిందని టాక్. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను మాత్రమే చేయాలని శ్రీలీల ఆశ పడుతోందట. ప్రస్తుతానికి ఈ అమ్మడు విజయ్ దేవరకొండ కి జోడీగా ఒక సినిమాలో మాత్రమే నటిస్తోంది. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com