Sree Leela : తమిళ స్టార్ హీరో అజిత్‌తో శ్రీలీల

Sree Leela : తమిళ స్టార్ హీరో అజిత్‌తో శ్రీలీల

యువ హీరోలతో పాటు సీనియర్ హీరోల సినిమాల్లోనూ శ్రీలీల అవకాశాలు దక్కించుకుంటున్నారు. తాజాగా ఆమెకు తమిళ స్టార్ హీరో అజిత్‌తో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తోన్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీలో ఆమె హీరోయిన్‌గా నటించనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తుండగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జూన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.

గతేడాది అజిత్ తునివులో నటించాడు. అది మంచి విజయమే అందుకుంది. ప్రస్తుతం విడామయుర్తి చేస్తున్నాడు. అజిత్ వయస్సు 52 సంవత్సరాలు కాగా శ్రీలీల వయస్సు 22 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య దాదాపుగా 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. అజిత్ సైతం తన పక్కన మరీ యంగ్ హీరోయిన్లను తీసుకోవాలని భావించరట.

ఇక గత ఏడాదే స్టార్ హీరోయిన్ గా స్టార్‌డమ్ సంపాదించుకున్న శ్రీలీల.. ఈ ఏడాది హీరోయిన్ గా ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయకపోవడం గమనార్హం. అదికాకుండా ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ న్యూస్ రావడం చూసి.. శ్రీలీల స్టార్‌డమ్ అప్పుడే తగ్గిపోయిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ ని కొంచెం నిరాశకి లోనవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story