Sree Leela : తండ్రి ఏజ్ హీరోతో తెగించిన శ్రీలీల

Sree Leela : తండ్రి ఏజ్ హీరోతో తెగించిన శ్రీలీల

ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకే మైలేజ్ ఎక్కువ. కుర్ర ఏజ్ నుంచి ఏజ్ బార్ వరకు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న హీరోలు ఇంకా ఉన్నారు. 95శాతం హీరోయిన్స్ మాత్రం పదేళ్ల స్పాన్ లోనే ప్యాకప్ చెప్పేస్తుంటారు. ఈ గ్యాప్ లో.. తమకంటే ఎక్కువ ఏజ్ ఉన్న హీరోలతో డ్యూయెట్స్ పాడటానికి కూడా హీరోయిన్లు సై అంటుంటారు. అలాంటి లిస్టులోకి ఓ క్రేజీ కుర్ర హీరోయిన్ చేరిపోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయికూర్చుంది.

హీరోయిన్ శ్రీలీల తనకంటే డబల్ ఏజ్ వయసు పెద్దగల హీరోతో జతకట్ట బోతుందనే వార్త వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీలో హీరోయిన్ గా శ్రీ లీల సెలెక్ట్ అయిందట. రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ ఓ సినిమాకి కమిటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో యంగ్ రోల్ లో కనిపించబోతున్న అజిత్ జోడిగా కనిపించబోతుందట శ్రీ లీల. క్యారెక్టర్ పరంగా యంగ్ అయినప్పటికీ అంత పెద్ద స్టార్ ఏజ్డ్ గల హీరోతో రొమాన్స్ చేయడానికి శ్రీలీల రెడీ అయిపోవడంపై ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.

సీనియర్ హీరోలు.. సీనియర్ హీరోలతో చేస్తేనే స్క్రీన్ ముచ్చటగా ఉంటుందన్నది చాలామంది చెప్పేమాట. బాలయ్య భగవంత్ కేసరిలో శ్రీలీల ఆయన కూతురుగా నటించి పర్ఫెక్ట్ అనిపించుకుంది. అలాగే ఉండాలి కూడా. కుదరని జంటలు ట్రోలింగ్ కు కారణమవుతుంటాయి. చూడాలి అజిత్, శ్రీలీల పెయిర్ ఎలా ఉంటుందో.

Tags

Read MoreRead Less
Next Story