Sree Leela : అవే నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చాయి : శ్రీలీల

శ్రీలీల ( Sree Leela ).. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. 'పెళ్లి సందడి' సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తూ సినీ ప్రియులను మెప్పిస్తోంది. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో కాస్త స్లో అయిన శ్రీలీల.. ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచింది. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది.
ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగైదు సినిమాల దాకా ఉన్నాయి. తాజాగా ఓ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలీల.. తన సక్సెస్ కు ప్లానింగ్స్ లాంటివి ఏమీ లేవని తెలిపింది. ప్రణాళికలు పెట్టుకుని.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తుని ప్లాన్ చేయడం తనకు తలకు మించిన భారమని వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం తాను ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటిదాని గురించే ఆలోచిస్తానని వెల్లడించింది. సినిమాల పట్ల తనకున్న అభిరుచి, ఆసక్తి, డాన్స్ మాత్రమే తనను ఇక్కడి దాకా తీసుకువచ్చినట్లు మాట్లాడింది. అయితే శ్రీలీల ఇలా మాట్లాడకూడదని ఫ్యాన్స్ అంటున్నారు. చాలా కష్టపడినట్లు, వ్యూహాత్మకంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సినిమాలు చేస్తున్నట్లు.. ఇతర హీరోయిన్స్ మాదిరిగా చెప్పాలని ఆమెకు సలహాలు ఇస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com