Sree Vishnu : ఆరంభం ప్రిరిలీజ్ ఈవెంట్‌లో శ్రీ విష్ణు

మోహన్ భగత్, సుప్రీత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు.
ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం' సినిమా రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్, డైరెక్టర్స్ నవీన్ మేడారం, వెంకటేష్ మహా, హీరోయిన్ శివానీ నాగరం గెస్ట్ లు గా హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ రెడ్డి మామిడి మాట్లాడుతూ ఈ సినిమాకు నేను కర్త, కర్మ, క్రియ అని మా టీమ్ వాళ్లు అంటున్నారు కానీ ఈ సినిమాకు అవన్నీ మా ప్రొడ్యూసర్ అభిషేక్ వీటీనే. నేను కో ఆర్డినేట్ చేశాను అంతే అని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com