Sreeleela : అప్పుడు దీపిక.. ఇప్పుడు శ్రీలీల.. బాలీవుడ్ ఎంట్రీపై అంతటా ఉత్కంఠ

Sreeleela : అప్పుడు దీపిక.. ఇప్పుడు శ్రీలీల.. బాలీవుడ్ ఎంట్రీపై అంతటా ఉత్కంఠ
X

కన్నడ అందం ఖతర్నాక్ మూవీ జర్నీ చేస్తోంది. తక్కువ కాలంలోనే శ్రీలీల ( Sreeleela ) బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో టాలీవుడ్ లో హల్చల్ చేసింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో సహా అగ్ర తారలతో స్క్రీన్ ను షేర్ చేసుకుంది.

సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఆమె కెరీర్ సాగిపోతోంది. శ్రీలీల త్వరలో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టనుందని బాలీవుడ్ మీడియా అంటోంది. కునాల్ దేశముఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దిలేర్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన శ్రీలీల నటించనున్నట్లు సమాచారం.

మాదాక్ ఫిలమ్స్ బ్యానర్ పై ఈ మూవీ రానుంది. సర్జమీన్ తర్వాత ఇబ్రహీం అలీ ఖాన్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ మూవీతో శ్రీలీల ఫిజిక్, టాలెంట్ బాలీవుడ్ ను కిర్రెక్కించడం కామన్. ఇదే జరిగితే కన్నడ అందం దీపికా తర్వాత శ్రీలీల అదేస్థాయిని అందుకోవడం ఖాయమే.

Tags

Next Story