Sreeleela : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల!

Sreeleela : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల!

పెళ్లి సందD' సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతోనే యూత్ భారీగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత రవితేజతో నటించిన ‘ధమాకా' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ కు పిచ్చ క్రేజ్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో శ్రీలీలకు వరుస ఆఫర్స్ వచ్చాయి. అయితే గత ఏడాది 4సినిమాలు రిలీజైతే.. భగవంత్ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. స్కంద, ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో శ్రీలీలకి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో శ్రీలీల కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది. అయితే ఈ ఏడాది ఆమె నటించిన గుంటూరు కారం సినిమా మంచి విజయం సాధించింది.

కానీ ఈ సినిమాలో కూడా శ్రీలీల పాత్రకు స్కోప్ లేదు. దీంతో కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ తీసుకుని స్టడీస్పై ఫోకస్ చేయాలని ఆమె ఫిక్సయ్యింది. టాలీవుడ్ లో ఈ భామకు ఆఫర్స్ రావని అంతా భావించారు. కానీ కోలీవుడ్ నుంచి ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరోస్ విజయ్, అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఇందులో హీరోయిన్ శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags

Next Story