Raviteja-Sreeleela : మరోసారి రవితేజకు జోడీగా శ్రీలీల?

X
By - Manikanta |28 May 2024 2:36 PM IST
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాణంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మూవీ టీమ్ ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ సినిమా చిత్రీకరణ జూన్ నెలాఖరులో ప్రారంభం కానుందని తెలిసింది. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ మూవీ 2025 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మించనున్నారు. ఇది రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం కావడం విశేషం. కాగా ఇప్పటికే రవితేజ, శ్రీలీల కలిసి ‘ధమాకా’లో ఆడిపాడిన సంగతి తెలిసిందే.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com