Tillu Square : టిల్లు స్క్వేర్ కు శ్రీలీల నో చెప్పిందట!

బాక్సాఫీస్ వద్ద విరుచుకుపడుతున్న సినిమా టిల్లు స్క్వేర్ (Tillu Square).. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వర్ (Anupama Parameshwaran) కన్నా ముందు శ్రీలీలతో (Sree Leela) కొన్ని సీన్లు షూట్ చేశారని తెలుస్తోంది. కొద్ది రోజుల తర్వాత శ్రీలీల బయటిక్ వచ్చేసిందట. కథాపరంగా ఉన్న బోల్డ్ నెస్, తప్పక పెట్టాల్సిన లిప్ లాక్ కిస్సుల వల్లే డ్రాప్ అయ్యిందనే టాక్ అంతర్గతంగా వినిపించింది. కట్ చేస్తే ఆ స్థానంలో అనుపమ వచ్చి దర్శకుడు కోరుకున్నది తెరమీద ఆవిష్కరించింది. ముఖ్యంగా క్యారెక్టర్ కు సంబంధించిన డిఫరెంట్ షేడ్స్ ని పోషించిన తీరు ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. కానీ శ్రీ లిల లిప్ లాక్ లకు ఇష్టపడకుండా బయటికి వచ్చేసిందని తెలుస్తోంది. ఆమె కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారనే టాక్ శ్రీ లీల అభిమానుల నుంచి వినిపిస్తోంది. శ్రీలీల ఇటీవలే చేసిన 'గుంటూరు కారం' ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోయినా.. డ్యాన్సు విషయంలో ఈ అమ్మడు ఇరగదీసిందనే టాక్ వచ్చింది. శ్రీలీల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com