Sreeleela : వరుస ప్లాపులు... ఇప్పుడు శ్రీలీల పరిస్థితి ఎంటీ?

గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాతో ట్రెండింగ్ లోకి వచ్చిన హీరోయిన్ శ్రీలీల (Sree Leela). రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడి చేతిలో ఇంతకూ సినిమాలున్నాయా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. ధమాకా సినిమా హిట్ అవ్వడంతో శ్రీలీల మరింత స్పీడ్ పెంచింది.
ఒకే సారి అయిదు ఆరు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీలీలకి భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మినహా మిగిలిన సినిమాలన్నీ నిరాశపర్చాయి. ఇప్పుడు శ్రీలీల చేతిలో ప్రస్తుతం సినిమాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలొస్తున్నాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagath Singh) లో శ్రీలీల ఎంపిక అయ్యిందనే వార్తలొచ్చాయి.
అయితే ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియదు. నితిన్ తో రాబిన్ హుడ్ (Robin Hood) సినిమాలో నటిస్తున్నట్లు వార్తలొచ్చినా క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండతో శ్రీలీల ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు మించి ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు పెద్దగా లేవనే అంటున్నారు. తమిళంలో ఏమైనా సినిమాలున్నాయా..? ఉండే ఉంటాయి అంటున్నారు కొందరు. ఇంతకూ ఈ లీల మళ్లీ తెలుగులో ఎప్పుడు గోల చేస్తుందో!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com