Sreemukhi : శ్రీముఖి ఐటం సాంగ్.. అగ్ర హీరో పక్కన?

Sreemukhi : శ్రీముఖి ఐటం సాంగ్.. అగ్ర హీరో పక్కన?

టీవీ రాములమ్మగా పాపులరైన శ్రీముఖికి సౌండ్ స్పీకర్ అని కూడా పేరు. శ్రీముఖి అరుపులు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ కు ఆకర్షణగా మారాయి. అందాల ఆరబోతతోనూ ప్రేక్షకులను కట్టి పడేస్తూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శ్రీముఖి. అలా.. ఇండస్ట్రీలో మరో కొత్త రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఓ పక్క సినిమాలతో మరో పక్క పలు షోస్ తో కెరియర్ ను ఫుల్ బిజీబిజీగా మలుచుకుంది శ్రీముఖి. శ్రీముఖికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఒక స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుందట. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఐటం సాంగ్ చేయబోతుందట.

విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు చిరంజీవి. వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరల్డ్ క్లాస్ ఫాంటసీ మూవీగా నిలిచిపోయేలా మూవీ మలుస్తున్నాడు వశిష్ఠ. హిస్టారికల్ సినిమాల్లో పరిచారికలు నటిస్తుంటారు. అలా.. శ్రీముఖి కూడా ఈ సినిమాలోని ఓ నర్తన గీతంలో నర్తకిగా కనిపించబోతోందని టాక్. శ్రీముఖి కూడా దీనికి ఓకే చెప్పిందట.

Tags

Next Story