Rakul Preet Singh Wedding : రకుల్ పెండ్లికి ఆహ్వానితులెవరంటే?

నటి ర కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth singh) పెళ్లి బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో (Jackie Bhagnani) జరుగుతున్న విషయం తెలిసిందే. గోవాలో (Goa) రేపు ఈ జంట వివాహ బంధంలో ఒక్కటవుతోంది. ఇప్పటికే పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రీవెడ్డింగ్ వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పెండ్లికి ముందు ఈ జంట ముంబై లోని సిద్దివినాయక ఆలయంలో పూజలు చేసింది. ఈ వివాహానికి హాజరయ్యే అతిథుల జాబితాపై ఊహాగానాలు సాగుతున్నా యి. ఈ పెళ్లికి రకుల్ బెస్ట్ ఫ్రెండ్స్ ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి హాజర వుతున్నారు.
బాలీవుడ్ నుంచి పలువురు సూపర్ స్టార్లు హాజరయ్యే చాన్స్ ఉంది. అక్షయ్ కుమార్, ఈషా డియోల్, టైగర్ ష్రఫ్, సోనమ్ కపూర్, రితీశ్ దేశ్ ముఖ్, షాహిద్ కపూర్, భూమి పెడ్నేకర్, ఆనంద్ అహూజా, వరుణ్ ధావన్, నటాషా ప లువురు టీవీ నటీనటులు కూడా హాజరు కానున్నారు.
టాలీవుడ్ నుంచి నాన్నకు ప్రేమ తో కోస్టార్ ఎన్టీఆర్.. ధ్రువ కోస్టార్ రామ్ చరణ్ హాజరవుతారని కూడా ఊహాగానాలున్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కోస్టార్ సందీప్ కిషన్ కూడా హాజరయ్యేందుకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. తెలుగు చిత్ర సీమలో ర కుల్ కి గొప్ప స్నేహ సంబంధాలున్నాయి. దీంతో పలువురు దర్శక నిర్మాత ల కు ఆహ్వానం అందేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com