Kalki 2898 AD : కల్కి నగరాల కథ చెప్పిన నాగ్ అశ్విన్

Kalki 2898 AD : కల్కి నగరాల కథ చెప్పిన నాగ్ అశ్విన్
X

ఇండియన్ మైథాలజీ- సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' ప్రమోషన్స్ దుమ్మురేపుతున్నాయి. ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్ తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్లు సంచలనం రేపుతున్నాయి.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మూవీలో నగరాల గురించి క్లారిటీగా చెప్పారు. ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది. "కాశీ భూమి మీద మొదటి నగరం. అలాంటిది ఈ ప్రపంచంలో కాశీనే ఆఖరి సిటీ అయితే ఎలా ఉంటుందన్న ఐడియాతో కల్కి స్క్రిప్ట్ స్టార్ట్ చేశాం. కలియుగం ఎండింగ్లో అంతా అయిపోయిన తర్వాత గంగ ఎండిపోయిన తర్వాత లాస్ట్ సిటీ ఏముటుందని అనుకుంటే, అలాంటి సమయంలో మన కాశీ వుంటే ఎలా ఉంటుంది, నాగరికత పుట్టిందే కాశీలో అలాంటి ఆ సిటీని క్రియేట్ చేయడం చాలా ఇంట్రస్టింగా ఉంటుంది. ఇండియన్ ఆర్కిటెక్చర్, వెహికిల్స్, కరెన్సీ ఇలా అన్ని ఫ్యూచరిస్టిక్ గా కాశీని బిల్డ్ చేయడం మొదలుపెట్టాం. కాశీని బిల్డ్ చేయడం వెరీ లాంగ్ ప్రాసెస్. కాశీపైన పిరమిడ్ ఆకారంలో ఉండే స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మేము కాంప్లెక్స్ అంటాం. భూమిపై లేని నేచర్, యానిమల్స్, ఫుడ్ ఇలా ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఒకరకమైన స్వర్గం అనుకోవచ్చు. కల్కి కథలో మూడో వరల్డ్ కూడా ఉంది. అదే శంబాల, ఇది కల్కి స్టొరీకి ఇంటిగ్రల్ గా ఉంటుంది. కాశీకి కాంప్లెక్సి కి సంబంధంలేని థర్డ్ వరల్డ్ ఈ వరల్డ్ ఉన్న వారు కాంప్లెక్స్ లో వున్నవారిని ఛాలెంజ్ చేస్తుంటారు. ఈ వరల్డ్ లో గాడ్ అనే భావన ఉండదు. గాడ్ ను బ్యాన్ చేసి వరల్డ్ ఈ మూడు వరల్డ్స్ మధ్య మన కథ నడుస్తుంది." అని చెప్పి అంచనాలు పెంచేశాడు నాగ్ అశ్విన్.

ఒకొక్క వరల్డ్ పై ఒకొక్క ఆలోచనతో డిజైన్ చేశామని చెప్పాడు నాగ్ అశ్విన్. జూన్ 27న వరల్డ్ వైడ్ గా కల్కి రిలీజ్ కానుంది.

Tags

Next Story