Tillu Square : తారక్ ఇంట్లో 'టిల్లు స్క్వేర్' సక్సెస్ పార్టీ.. ఆయన డుమ్మా

Tillu Square : తారక్ ఇంట్లో టిల్లు స్క్వేర్ సక్సెస్ పార్టీ.. ఆయన డుమ్మా

టిల్లు స్క్వేర్ (Tillu Square) పేరు మారుమ్రోగిపోతుంది. సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా రిలీజైన ఈ మూవీ కలెక్షన్లలో దుమ్ములేపుతోంది. గతంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డీజేటిల్లుకి ఈ సినిమా సీక్వెల్ గా వచ్చింది.

మాలిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 29న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. మొత్తం ఐదు రోజులు పూర్తి అయ్యేసరికి కలెక్షన్స్ 85 కోట్లు క్రాస్ చేసి సంచలన రికార్డును నమోదు చేసింది. ఈ సినిమా హిట్ అవడంతో జూనియర్ ఎన్టీఆర్ మూవీ టీం కి సక్సెస్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ పార్టీలో నిర్మాత నాగవంశీ, హీరో సిద్దు జొన్నలగడ్డ, దోస్త్ విశ్వక్సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు.

ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీలో ఎక్కడా కూడా డైరెక్టర్ కనిపించలేదు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే సిద్దుకి డైరెక్టర్ కు గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. అందుకే ఆయన దూరంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story