Sudheer Babu : ప్యాన్ ఇండియా మిస్టరీ థ్రిల్లర్‌లో సుధీర్ బాబు

సుధీర్ బాబు ( Sudheer Babu ) హీరోగా మిస్టరీ థ్రిల్లర్ తెరకెక్కనుంది. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వెంకట్ కల్యాణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
రుస్తుం, టాయ్లెట్, ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ వంటి చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు నటించే చిత్రం రూపొందనుంది. బాలీవుడ్ కు చెందిన నటి నాయికగా నటిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలో తెలియజేయనుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేస్తారు.
ఈ చిత్రంలో కుట్ర పన్నాగాలు కలగలిసిన చెడుకి, మంచి యుద్ధంగా ఇండియన్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ గా రూపొందనుందని మేకర్స్ తెలిపారు. తనకు స్క్రిప్ట్ నచ్చి ఏడాది పాటు టీమ్ తో ట్రావెల్ అవుతున్నాననీ.. వైవిధ్యమైన కంటెంట్ తో ఈ సినిమా నిర్మాణమవుతోందనీ.. ప్రపంచస్థాయి సినిమా అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు టీమ్ కష్టపడుతోంది అన్నారు సుదీర్ బాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com