Suhas : దూసుకుపోతున్న సుహాస్.. చేతిలో 8 సినిమాలు

కలర్ ఫొటో మూవీ సుహాస్ రాత మార్చేసింది. ఒకప్పుడు బుల్లి తెరపై కనిపించాలని తహతహలాడాడు. అదృష్టానికి ప్రతిభ తోడై, మంచి కథలు వచ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథ, పక్కింటి అబ్బాయి లాంటి పాత్రలు సుహాస్‌ని వెదుక్కొంటూ వెళ్తున్నాయి.
ఇప్పుడు సుహాస్ చేతిలో ఏకంగా 8 సినిమాలున్నాయి. సుహాస్ ఇప్పుడు కథ విన్నా, అది నచ్చినా, రెండేళ్ల వరకూ షూటింగ్ కి వెళ్లలేని పరిస్థితి ఉందంటే, సుహాస్ స్పీడు ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. రూ.5 నుంచి రూ.6 కోట్ల లోపు పూర్తయ్యే సినిమాలకు సుహాస్ ఇప్పుడు ఓ మంచి ఆప్షన్‌గా మిగిలాడు.
సుహాస్ నటించిన గత సినిమాలు బాగా ఆడడం, ఓటీటీలో తనకంటూ ఓ మార్కెట్ ఉండడం వల్ల, పెట్టుబడి ఎలాగైనా తిరిగి వస్తుందన్న నమ్మకం నిర్మాతలకు కలుగుతుతోంది. కలర్ ఫొటోకు నామినల్ రెమ్యునరేషన్ తీసుకు సుహాస్.. ప్రస్తుతం తన సాఫ్ట్ ఇమేజ్ కారణంగా.. రూ.2కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 'ప్రసన్నవదనం' మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com