Suhas New Movie Name : సుహాస్ కొత్త సినిమా.. 'గొర్రె పురాణం'

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్నవదనం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
సరికొత్త కథా, కథనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరో వినూత్న కథతో అడి యన్స్ ముందుకు రానున్నాడు సుహాన్. అదే గొర్రె పురాణం. ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదల చేశారు.
వినూత్న కథతో వస్తున్న ఈ సినిమా టీజర్ చాలా కొత్తగా ఉంది. ఇప్పుడొక మీకొక బ్రేకింగ్ న్యూస్.. ఒక గ్రామంలో రెండు వర్ణాల మధ్య ఒక గొర్రె చిచ్చు పెట్టింది. అనే వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యింది ఈ టీజర్. తరువాత.. ఆ గొర్రె మాది అంటే మాది అని అంటూ హిందూ, ముస్లింలు వాదించుకుంటారు. అలా చిన్నగా మొదలైన గొడవ గ్రామ సమస్యగా మారుతుంది. ఈ మూవీ టీజర్ లో సుహాస్ జైల్లో ఖైదీలా కనిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com