Emotional Post : సూర్యకిరణ్ మృతి.. సుజిత ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ దర్శకుడు, రచయిత సూర్యకిరణ్ (Suryakiran) మృతిపై ఆయన సోదరి, నటి సుజిత (Sujitha) ఎమోషనల్ అయ్యారు. ‘ఆయన నాకు అన్నయ్య మాత్రమే కాదు. నా హీరో, తండ్రి లాంటి వాడు. ఇండస్ట్రీలో నీ టాలెంట్‌కు, నీ మాటలకు నేను ఎప్పుడైనా అభిమానినే. మరో జన్మంటూ ఉంటే అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం సుజిత పలు సీరియల్స్‌లో నటిస్తూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు సుజిత . పసివాడి ప్రాణం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగింది. చిన్నప్పుడు వారు తండ్రిని కోల్పోవడంతో ఒక నాన్నలా తమ కుటుంబాన్ని సూర్యకిరణ్ పోషించారని గతంలో సుజిత చెప్పారు.
ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్‌లలో నటిస్తూ హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యారు. తమ మధ్య 8 ఏళ్లు గ్యాప్ ఉండటంతో ఎంతో ప్రేమగా అన్నయ్య చూసుకునేవారని ఆమె పేర్కొంది. కాగా పచ్చ కామెర్ల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూర్య కిరణ్ మార్చి 11న కన్నుమూశారు. చెన్నైలో ఆయన అంత్యక్రియలు జరిగిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ఇండస్ట్రీ కూడా దిగ్భ్రాంతి చెందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com