Kanguva Movie : సూర్య కంగువ వార్ సీన్స్ కోసం బాహుబలిని మించిన సెటప్

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు సూర్య. ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో సూర్య ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు శివ దర్శకత్వంలో ‘ కంగువ’ అనే సినిమా చేస్తున్నాడు. గ్రాఫికల్ షాట్స్ తో ఈ సినిమా విజువల్ వండర్ ని క్రియేట్ చేయబోతుందనే విషయమైతే ఈ సినిమా గ్లింప్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది.
ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే సూర్య, బాబీ డియోల్ మధ్య 10 వేల మందితో ఒక భారీ వార్ సీన్ ను షూట్ చేశారట. ఒక్క ఫైట్ కోసమే దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు పెట్టారట.. అయితే ఈ వార్ సీన్ సినిమాకి హైలెట్ కాబోతుందట. ఈ వార్ సీన్ లో ఒకటి రెండు చిన్న చిన్న ప్యాచ్ వర్క్ షాట్స్ ఉండడం వల్ల మరోసారి జూనియర్ ఆర్టిస్టులతో ఈ సినిమాలోని ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయాలనే ఉద్దేశంలో శివ ఉన్నారట.
బాహుబలి యుద్ధాల సెటప్ ను మించేలా ఆర్టిస్టులు బడ్జెట్ తో ఈ సీన్స్ తీశారని టాక్ వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com