Surya and Jyothika : 18 ఏళ్ల తర్వాత మళ్లీ .. జంటగా నటించనున్న సూర్య, జ్యోతిక

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్ హీరో సూర్య.. జ్యోతిక జంట ఒకటి. కోలీవుడ్లో వీరి జోడికి ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఇద్దరు కలిసి సినిమాలు చేస్తున్న సమయంలోనే ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరికి పాప, బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత సూర్య వరుస సినిమాలు చేస్తుండగా.. జ్యోతిక మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చింది. రీసెంట్గా 36 వయదినిలే మూవీతో కథానాయికగా రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మరిన్ని మూవీల్లో యాక్ట్ చేసేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇక సూర్య, జ్యోతిక ఇద్దరు కలిసి 1999లో విడుదలైన పూవెల్లామ్ కేట్టుప్పార్ చిత్రంలో తొలిసారి కలిసి నటించారు. ఆ తరువాత మరికొన్ని సినిమాలు చేశారు. ఇకపోతే 18 ఏళ్ల తరువాత వీరిద్దరు మరోసారి జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి సినిమాను ఓ లేడీ డైరెక్టర్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. ఈ సినిమా గనుక ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించే ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com