Taapsee : తాప్సీ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

తన బాయ్‌ఫ్రెండ్, మాజీ బాడ్మింటన్ ఆటగాడు మాతీస్ బో తో హీరోయిన్ తాప్సీ వివాహం మార్చి 22న జరిగినా ఇంతవరకూ ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కనీసం పెళ్లి ఫొటోను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేదు. అయితే వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇటీవల లీక్ అయి వైరల్ అయ్యాయి. వీరి పెళ్లి ఎక్కడ జరిగింది?, ఎలా జరిగింది?, ఎంత ఖర్చు అయింది? అన్న సమాచారం తెలిసింది.
తాప్సీ సన్నిహితులు వెల్లడించిన వివరాలు ఏమిటంటే.. తాప్సీ పెళ్లి డానిష్, హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఏకలవ్య స్టార్ హోటల్‌లో జరిగింది. ఇది చాలా ఖరీదైన హోటల్ కావడంతో పెళ్లి ఏర్పాట్లు, భోజనాలకే రూ. 60 నుంచి 80 లక్షల వరకూ ఖర్చు అయిందని అంటున్నారు.
మిగిలిన అన్ని ఖర్చులు కలిపితే కోటి రూపాయలు దాటిందని అంటున్నారు. కుటుంబ సభ్యులు, అతి ముఖ్యలైన స్నేహితులే హాజరైనా పెళ్లి మాత్రం చాలా గ్రాండ్‌గా జరిగిందని అంటున్నారు. డీజే గణేశ్, అభిలాష్ తాప్లియాల్, డెల్‌రాజ్ బున్‌షా తదితరులు ఆట పాటలతో హోరెత్తించి, అతిథులను ఆనంద పరిచారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com