Crew Movie : క్రూ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి టబు..
తన నటన, అభినయంతో రెండు జాతీయ, ఆరు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న బ్యూటీ టబు (Tabu). అటు బాలీవుడ్ ఇటు సౌత్ అభిమానులకు సుపరిచితురాలైన ఈ అమ్మడికి ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఏళ్లుగా తనదైన నటనతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ క్రేజ్ సంపాందించుకుంది. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా విడుదలైన 'క్రూ' సినిమాతోనూ భారీ హిట్ ను ఈ అమ్మడు అందుకుంది.
ఇందులో తనదైన శైలిలో నటించి ప్రశంసలు దక్కించుకుంది. సినిమాలో కృతి సనన్, కరీనా కపూర్ లతో పోటీపడుతూ వారిని డామినేట్ చేసింది. అంధాధున్, దృశ్యం 2, భూల్ భూలయ్యా 2 వంటి కొన్ని బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత టబు నటించిన మరో హిట్ సినిమాగా క్రూను చెప్పవచ్చు. ఇందులోటబులో సరికొత్త కోణాన్ని చూశామని అభిమానులు అంటున్నారు.
కొన్ని సన్నివేశాలలో ఈ బ్యూటీ నటన కడుపుబ్బా నవ్వించిందని చెబుతున్నారు. క్రూ విజయంతో టబు కీలక పాత్రలో మరిన్ని సినిమాలు రూపుదిద్దుకోనున్నాయనే వెలువడుతున్నాయి. ఇక క్రూ సినిమా విషయానికొస్తే కామెడీ నేపథ్యంలో ఇది రూపుదిద్దుకుంది. గత నెల 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారీగా వసూళ్లను రాబడుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com