Tabu : టబు చాలా లక్కీ హాలీవుడ్ లో ఛాన్స్

Tabu : టబు చాలా లక్కీ హాలీవుడ్ లో ఛాన్స్

ఇటీవలే రిలీజైన 'ది క్రూ' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు. అందులో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఏకంగా 150 కోట్లకు పైగా వసూళ్లు సాందించింది. దీంతో తన క్రేజ్ పెంచుకున్న టబు.. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తనదైన రీతిలో రాణిస్తోంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోన్న ఈ అమ్మడికి.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్లో అవకాశం వచ్చింది.

వరల్డ్ వైడ్ గా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డ్యూన్ సిరీస్లో అవకాశం అందుకుంది. త్వరలో అదే టైటిల్ కి ప్రోఫెసిని జోడించి భారీ బడ్జెట్ తో ఈ ప్రీక్వెల్ తెరకెక్కించనున్నారు. ఇందులో టబు సిస్టర్ ఫ్రాన్సెస్ గా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఇండియా వైడ్ గా టబు పేరు మరోసారి మారుమోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సిరీస్లో ఛాన్స్ అందుకోవడమంటే మాములు విషయం కాదని.. టబు చాలా లక్కీ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఈ సీరిస్ రిలీజ్ కావడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టొచ్చని పలువులు అంచనా వేస్తున్నారు.

రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచిన హైదరాబాదీ బ్యూటీ టబు. మూడు దశాబ్దాల క్రితం వెంకటేష్ ‘కూలీ నంబర్ 1′ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన టబు.. ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. వయసుతో నిమిత్తం లేకుండా అప్పటి నుంచి ఇప్పటివరకూ వరుస సినిమాలతో బిజీగా సాగుతూనే ఉంది ఈ బ్యూటీ.

Tags

Next Story