Tamannah : చిక్కుల్లో తమన్నా.. పోలీసుల నోటీసులు

Tamannah : చిక్కుల్లో తమన్నా..  పోలీసుల నోటీసులు

మిల్కీ బ్యూటీ తమన్నా చిక్కుల్లో పడింది. ఐపీఎల్ 2023 మ్యాచ్లను ఫెయిర్ ప్లే యాప్ లో స్టీమింగ్ చేసినందుకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. వయాకామ్ సంస్థ.. తమన్నాపై ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. కాగా ఐపీఎల్ 2023 ప్రసార హక్కులను వయాకామ్ సంస్థ సొంతం చేసుకుంది.

ఫెయిర్ ప్లే యాప్ లో మ్యాచ్ లను తమన్నా స్టీమింగ్ చేయడంతో తమ సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని వయాకామ్ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు.. కేసును మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు తమన్నాకి నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఇదే కేసులో సీనియర్ నటుడు సంజయ్ దతికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.

ఈ కేసులో ఈ నెల 23న ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. దీంతో విచారణకు వచ్చేందుకు సంజయ్ దత్ మరో రోజును కోరారు. దీంతో ఆయనను కూడా ఈ నెల 29 తేదీనే పోలీసులు విచారణకు పిలిచినట్లు సమాచారం. తమన్నా, సంజయ్ దత్ తో సహా ఇతర స్టార్స్ ఫెయిర్ యాప్ కు ప్రమోషన్స్ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story