Tamannah : స్కూలు పాఠంగా తమన్నా జీవితం.. కొత్త వివాదం

ప్రముఖుల జీవితాలను పాఠ్యాంశంగా స్కూల్లో చదువుకునే పిల్లలకి చెబుతుంటారు. దేశ నాయకులవి కాకుండా.. సినిమా నటుల జీవితాలను పిల్లలకు పాఠాలుగా చెప్పడం వివాదాస్పదమవుతోంది. బెంగళూరులోని హెబ్బళ సింధీ ఉన్నత పాఠశాల ఇదే పనిచేసింది.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని హెబ్బళ సింధీ హై స్కూల్ లో 7వ తరగతి పిల్లలకు పాఠ్యాంశంగా సినీ నటీ తమన్నా జీవితాన్ని బోధిస్తున్నారు. దేశవిభజన అనంతరం సింధీకి చెందిన ప్రముఖుల గురించి చెప్పే విషయంలో తమన్నా, రణ్ వీర్ సింగ్ వీరి గురించి చేర్చారు. ఇది కాంట్రవర్సీ రేపుతోంది.
సింధీ వర్గంలో ఎంతోమంది ప్రముఖులు, కవులు, కళాకారులు ఉండగా.. సినిమా నటుల జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని విద్యార్థుల పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. పాఠశాలకు వచ్చి లొల్లి చేశారు. సింధీ వర్గానికి చెందిన తమన్నా అత్యున్నత స్థాయికి చేరి విజయాలు సాధించడం వల్లే ఆ పాఠం బోధించామని స్కూల్ వివరణ ఇచ్చినా జనం కోపం చల్లారలేదు. దీనిపై పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com